ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AMIT SHAH: శ్రీశైలం మల్లన్న సేవలో కేంద్రహోంమంత్రి.. కుటుంబీకులతో సందర్శన

శ్రీశైలం మల్లన్నను కేంద్రహోంమంత్రి అమిత్ షా.. కుటుంబ సభ్యులతో కలిసి దర్శంచుకున్నారు. కేంద్ర హోం మంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్రహోంమంత్రి అమిత్ షా
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్రహోంమంత్రి అమిత్ షా

By

Published : Aug 12, 2021, 11:25 AM IST

Updated : Aug 13, 2021, 8:50 AM IST

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్రహోంమంత్రి అమిత్ షా

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లను గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దంపతులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు హైదరాబాద్‌నుంచి హెలికాప్టర్‌లో అమిత్‌ షా దంపతులు సున్నిపెంట చేరుకున్నారు. హెలిప్యాడ్‌ వద్ద అమిత్‌షాకు దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, ఇంటెలిజెన్స్‌ ఐజీ శశిధర్‌రెడ్డి, డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సున్నిపెంట నుంచి కారులో శ్రీశైలం వచ్చిన అమిత్‌ షా దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద తిలకధారణ చేసి దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌, ఆలయ ఈవో రామారావు, ప్రధానార్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

అనంతరం వారు ప్రధాన ధ్వజస్తంభానికి బిల్వ దళాలు సమర్పించి భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అమిత్‌ షాకు వేదపండితులు వేదాశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు. ఇటీవల తవ్వకాల్లో లభించిన తామ్ర శాసనాలను అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అమిత్‌ షా దంపతులు వీక్షించారు. దర్శనం తర్వాత మొబైల్‌ కారులో అమిత్‌ షా ఆలయ మాడవీధులను వీక్షించారు. శాస్త్రోక్తంగా అర్జున మొక్కను నాటారు. అనంతరం భ్రమరాంబ అతిథిగృహంలో భోజనం చేసి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత సున్నిపెంటకు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు.

Last Updated : Aug 13, 2021, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details