YSRCP Samajika Sadhikarata Bus Yatra in Tirupati :వైసీపీ సామాజిక సాధికారత బస్సుయాత్ర ప్రజలకు సమస్యగా మారింది. తిరుపతి, విజయనగరం సహా రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార యాత్ర కారణంగా ప్రజలకు అవస్థలు తెచ్చిపెడుతోంది. ఈ సందర్భంగా వాహన రాకపోకలకు ఆంక్షలు విధించారు. అలిపిరి నుంచి బాలాజీ వరకు ట్రాఫిక్ నిబంధనలు విధించారు. వాహనాలను అనుమతించకపోవడంతో వానదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఖరికి108 వాహనం వెళ్లడానికి కూడా తిప్పలు తప్పడం లేదు ప్రజలకు.
"ఒక్క రూపాయీ విడుదల చేయకుండా.. ఇలా యాత్రలు కూడా చేస్తారా"
Samajika Bus Yatra Day 2 : యాత్ర ప్రారంభం కాక ముందే రహదారులను పోలీసులు, వైసీపీ నాయకులు దిగ్బంధం చేశారు. నగరంలోని పలు కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాలనీల నుంచి రాకపోకలు నిలిపేశారు. దీంతో చిత్తూరు, మదనపల్లె నుంచి తిరుపతి నగరంలోకి వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బాలాజీ కాలనీ నుంచి పశువైద్య విశ్వవిద్యాలయం వరకు రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవెపు బాలాజీ కాలనీ నుంచి మహిళా విశ్వవిద్యాలయం వరకు వాహనాలు ఆగిపోయాయి. నగరంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, ఎన్టీఆర్ కూడలి, అలిపిరి, ఐఎస్ మహల్ కూడళ్ళలో ట్రాఫిక్ అంక్షలతో నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు.