ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలా మాట్లాడితే.. ఎవరైనా చర్యలు తప్పవు: బాలినేని - Balineni fire on Venkatagiri issu

Former Minister Balineni Srinivas: పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని వైసీపీ ప్రాంతీయ సమన్వయ కర్త బాలినేని శ్రీనివాస్ తెలిపారు. తిరుపతిలో జరిగిన వైసీపీ జిల్లా సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాలకృష్ణ సినిమా ఫంక్షన్‌కు భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఎస్పీ అనుమతులు ఇవ్వలేదని వేరేచోట ఫంక్షన్‌కు అనుమతులు ఇచ్చారని ఆయన తెలిపారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 5, 2023, 10:31 PM IST

Former Minister Balineni Srinivas: పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్షమించేది లేదని.. అందుకే వెంకటగిరి నియోజకవర్గ ఇన్​చార్జ్​గా నేదురుమల్లి రామ్​కుమార్ రెడ్డి నియామకం జరిగిందని వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్ తెలిపారు. తిరుపతిలో వైసీపీ జిల్లా సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. పార్టీకి వ్యతిరేకంగా మితిమీరి మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలను బలోపేతం చేసేందుకు పరిశీలకుల నియామకం చేపట్టామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు గ్రాఫ్​ పెరిగిందని.. మూడు జిల్లాల్లో పార్టీకి తిరుగు లేదని ధీమా వ్యక్తం చేశారు.

మూడు జిల్లాల్లో పార్టీకి తిరుగు లేదని ధీమా వ్యక్తం చేసిన బాలినేని

అందుకే అలా..:బాలకృష్ణ సినిమా ప్రీ రిలీజ్​ ఫంక్షన్​కు భద్రతా పరిస్థితుల దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వలేదని.. వేరే చోట ఫంక్షన్‌కు అనుమతి ఇచ్చారని బాలినేని వివరించారు.

ఇవీ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details