ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానులకు మద్దతుగా... వైకాపా రాయలసీమ ఆత్మగౌరవ సభ

YSRCP Rayalaseema Atma gourava Sabha: మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో వైకాపా రాయలసీమ ఆత్మగౌరవ సభ నిర్వహించింది. కర్నూలును న్యాయరాజధాని చేయడం ద్వారా రాయలసీమ అభివృద్ధి చెందుతుందని వైకాపా నేతలు అన్నారు. వికేంద్రీకరణను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు.

By

Published : Oct 29, 2022, 8:33 PM IST

YSRCP Rayalaseema Atma gourava Sabha
వైకాపా రాయలసీమ ఆత్మగౌరవ సభ

వైకాపా రాయలసీమ ఆత్మగౌరవ సభ

YSRCP Rayalaseema Atma gourava Sabha: వికేంద్రీకరణకు మద్దతుగా వైకాపా తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన ర్యాలీ నిర్వహించింది. విద్యార్థులు, మహిళలతో కృష్ణాపురం ఠానా నుంచి తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి రాయలసీమ ప్రజలు వ్యతిరేకమని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని వైకాపా నేతలు ఆరోపించారు.

"అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే తపన ఉన్న వ్యక్తి జగన్‌. మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా సమర్థిస్తున్నారు. కర్నూలుకు హైకోర్టు రావడం రాయలసీమ ఆత్మగౌరవానికి ప్రతీక." -తిరుపతి రాయలసీమ ఆత్మగౌరవ సభలో వైకాపా నేతలు

రాయలసీమ ఆత్మగౌరవ సభకు మెప్మా అధికారులు మహిళలను భారీగా తరలించారు. అయితే సభ జరగుతుండగానే మహిళలు వెళ్లేందుకు యత్నించగా...వారిని ఆపేందుకు నానాతంటాలు పడ్డారు. వేదిక ముందు నుంచి వెళ్లకుండా నిలువరించగా ....వెనుక వైపు నుంచి మహిళలు వెళ్లిపోయారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details