ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీడీపీ నాయకులు సవాల్​ విసిరి మరిచిపోయారు : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

Minister Peddi Reddy : చిత్తూరు జిల్లాలో వైసీపీ మంత్రి పెద్దిరెడ్డికి, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జిల్లా అభివృద్ధిపై మంత్రి పెద్ది చర్చకు రావాలని ఇరు నేతల మద్య సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. చివరకు చర్చకు రాకుండానే టీడీపీ నేతలు పలాయనం చిత్తగించి.. ఇక్కడి నుంచి వెళ్లిపోయారాని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 12, 2023, 5:48 PM IST

Minister Peddi Reddy Ramachandra Reddy : యువగళం పాదయాత్ర సందర్భంగా చిత్తూరు జిల్లా అభివృద్ధిపై టీడీపీ నేతలు చేసిన సవాల్ పై మంత్రి పెద్దిరెడ్డి స్పందిచారు. వైసీపీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. జిల్లా అభివృద్ధిపై చర్చకు సవాల్ విసిరిన టీడీపీ నాయకులు పారిపోయారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విమర్శించారు. ఎంపీ మిథున్​ రెడ్డి ప్రస్తుతం తంబళ్లపల్లెలో ఉన్నారని.. అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమేనని మంత్రి తెలిపారు. మాజీ మంత్రి అమర్​నాథ్​ రెడ్డి లోకేశ్​కు తప్పుడు సమాచారం అందించి మాట్లాడిస్తున్నారని అన్నారు. స్వయంగా సవాల్​ చేసిన అమర్నాథ్​ రెడ్డి కనిపించటం లేదన్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని పెద్ది పేర్కొన్నారు.

"ఒక వైపు అమర్నాథ్​ రెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకుడు, మాజీ మంత్రి అయి ఉండి కూడా.. చిటీలు అందించి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. లోకేశ్​తో చెప్పించిందే కాకుండా, అమర్నాథ్​ రెడ్డి స్వయంగా మేము సిద్ధంగా ఉన్నామని స్టెట్​మెంట్​ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎందుకు పలాయనం చిత్తగించారు."- పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాష్ట్ర మంత్రి

సవాల్​ వెనక ఉన్న కథేంటంటే :లోకేశ్ పాదయాత్ర సందర్భంగా జిల్లాలో జరుగుతున్న వైసీపీ నేతల అక్రమాలపై తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లాలో అభివృద్ది శూన్యమని.. నిరుద్యోగులు, యువత తీవ్ర స్థాయిలో నిస్పృహలో ఉన్నారని ఆరోపించారు. పాదయాత్ర జరిగే సమయంలో లోకేశ్ కూడా మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మదనపల్లి నియోజకవర్గానికి ఒక్క ఎమ్మెల్యే కాదని.. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన దుయ్యబట్టారు. ​ఎమ్మెల్యే నవాజ్ బాషాతో, పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు అందరు కలిసి మదనపల్లిని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఖాళీగా ప్రభుత్వ భూములు కనిపిస్తే.. ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 40 ఎకరాల భూమిని కబ్జా చెసీ.. వెంచర్​లు వేసి అమ్మేశారని ధ్వజమెత్తారు. చివరకు కొండలు, చెరువులు, భూములు దేన్ని వదలకుండా స్వాహా చేస్తున్నారని వివరించారు. వందల కొద్ది టిప్పర్ల ద్వారా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే పెద్దిరెడ్డి అభివృద్దిపై చర్చకు రావాలని సవాల్​ విసిరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే.. మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత స్వయంగా తానే తీసుకుంటనని లోకేశ్​ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాష్ట్ర మంత్రి

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details