VIDEO VIRAL: తిరుపతి జిల్లా యర్రావారిపాళ్యం మండలం బోడెవాండ్లపల్లి పంచాయతీ పెద్ద వడ్డిపల్లికి చెందిన శ్రావణి అనే యువతి.. ఉపాధి కోసం గత నెలలో కువైట్కు వెళ్లింది. అయితే ప్రస్తుతం అక్కడి యజమాని తనను సరిగా చూసుకోకపోవడంతో మరో చోట తనకు పని కల్పించాలని ఏజెంటును వేడుకొంది. ఐతే చంగల్ రాజా అనే ఏజెంట్ ఒక గదిలో ఆమెను బంధించి తన కోర్కె తీర్చాలని వేధిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు ఆ యువతి సెల్ఫీ వీడియో పంపింది. నాలుగు రోజులుగా ఆహారం ఇవ్వకుండా, మంచినీళ్లు మాత్రమే ఇచ్చి వేధిస్తున్నాడని తెలిపింది. ఎలాగైనా తనను తిరిగి ఇండియాకు తీసుకెళ్లాలని శ్రావణి వేడుకుంటోంది. మేకలపల్లెకు చెందిన చంగల్ రాజా, మదనపల్లెకు చెందిన బావాజీ అనే ఇద్దరు ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది. ఈ విషయం తెలిసిన శ్రావణి కుటుంబ సభ్యులు, ఆమె భర్త చందు కుమార్ భాకరాపేట సీఐ తులసీరామ్కు ఫిర్యాదు చేశారు.
'ఏజెంట్ వేధిస్తున్నాడు.. నన్ను ఇండియాకు తీసుకురండి'.. ఓ యువతి సెల్ఫీ వీడియో..! - తిరుపతి జిల్లా తాజా వార్తలు
VIDEO VIRAL: ఉపాధి నిమిత్తం ఓ యువతి గత నెలలో కువైట్కు వెళ్లింది. అయితే తన ప్రస్తుత యజమాని తనను సరిగా చూసుకోకపోవడంతో మరో చోట తనకు పని కల్పించాలని ఏజెంటును వేడుకొంది. కానీ ఆ ఏజెంట్ మాత్రం ఒక గదిలో తనను బంధించి అతని కోర్కె తీర్చాలని వేధిస్తున్నట్లు ఆ యువతి కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో పంపింది. ఎలాగైనా తనను తిరిగి ఇండియాకు తీసుకెళ్లాలని శ్రావణి వేడుకుంటోంది.
'ఏజెంట్ వేధిస్తున్నాడు.. దయచేసి నన్ను ఇండియాకు తీసుకురండి'.. ఓ యువతి సెల్ఫీ వీడియో
Last Updated : May 31, 2022, 11:41 AM IST