ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాడ్జ్​లో యువతి, యువకుడి ఆత్మహత్య..

man and woman committed suicide in a lodge: తిరుపతి నగరంలోని ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. మృతులు హైదరాబాద్‍కు చెందిన కృష్ణారావు, తూర్పుగోదావరి చెందిన అనూషగా పోలీసులు గుర్తించారు. ఇద్దరి కులాలు వేరని యువతి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్య
suicide

By

Published : Nov 8, 2022, 1:43 PM IST

Updated : Nov 9, 2022, 10:48 AM IST

committed suicide in a lodge: ప్రేమను కాదని పెళ్లి చేసినా.. చావులోనైనా ఒక్కటవ్వాలనుకుందో ప్రేమజంట. తిరుపతి తూర్పు ఠాణా సీఐ బీవీ శివప్రసాద్‌రెడ్డి వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన అనూష(20), హైదరాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతానికి చెందిన కృష్ణారావు(21) ప్రేమించుకున్నారు. అనూష నగరంలో బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు వీరిద్దరికి పరిచయం ఏర్పడింది.

ఇద్దరి కులాలు వేరని యువతి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. ఈమెను తూర్పుగోదావరి జిల్లాకే చెందిన పోషిబాబుతో రెండేళ్ల కిందట పెళ్లి చేశారు. తరువాతా వారి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది. నాలుగు రోజుల కిందట అనూష ఇంటి నుంచి వచ్చేసింది. ఆమె కనబడలేదని కొవ్వూరు ఠాణాలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కృష్ణారావు, అనూష ఈ నెల 7న తిరుపతి చేరుకుని ఓ లాడ్జిలో దిగారు. గది నుంచి బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది కిటికీనుంచి చూడగా.. ఉరి వేసుకుని కనిపించారు.

ఫ్యానుకు చున్నీతో చెరో వైపు ఉరి వేసుకున్నారు. పోలీసులు వచ్చి ఆధారాలు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన సమాచారంతో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విషాదం అలుముకుంది. అనూష భర్త పోశిబాబు కొవ్వూరులోని కర్మాగారంలో పనిచేస్తున్నారు. ఈనెల 3న అర్ధరాత్రి అతడు విధులకు వెళ్లి ఉదయం వచ్చేసరికి అనూష కనిపించలేదు. ఆచూకీ దొరక్క అతడు పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి

Last Updated : Nov 9, 2022, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details