YCP LEADER HALCHAL : తిరుపతి 31వ డివిజన్ సచివాలయంలో వైసీపీ నాయకుడు వీరంగం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. స్థానిక వైసీపీ నాయకుడు బొమ్మగుంట రవి.. ప్రణాళిక విభాగం కార్యదర్శిపై బూతుల దండకం అందుకున్నారు. సచివాలయం నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ.. హుకుం జారీ చేశారు. భయపడిన కార్యదర్శి బైకుపై వెళ్లబోతుండగా.. మళ్లీ అడ్డగించాడు.
తిరుపతిలో వైసీపీ నేత హల్‌చల్.. వైరల్ అవుతున్న వీడియో - తిరుపతిలో వైసీపీ నేత హల్‌చల్
YCP LEADER HALCHAL IN TIRUPATI : తిరుపతిలో వైసీపీ నాయకుడు వీరంగం సృష్టించారు. ప్రణాళిక కార్యదర్శిపై రెచ్చిపోయారు. సచివాలయం నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. వైసీపీ నాయకుడు వీరంగం చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
![తిరుపతిలో వైసీపీ నేత హల్‌చల్.. వైరల్ అవుతున్న వీడియో YCP LEADER HULCHAL IN TIRUPATI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17300597-646-17300597-1671882313565.jpg)
YCP LEADER HULCHAL IN TIRUPATI
తిరుపతిలో వైసీపీ నేత హల్‌చల్.. వీడియో వైరల్
31వ డివిజన్ కార్పొరేటర్ సి.కె. రేవతి చెప్పినట్లు వింటూ పార్టీకి నష్టం చేస్తున్నాడని అతనిపై విమర్శలు గుప్పించాడు. 31 డివిజన్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి కార్పొరేటర్ తరఫున డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించాడు. బహిరంగంగా ఓ ప్రభుత్వ కార్యాలయంలోకి ప్రవేశించి వీరంగం సృష్టించిన వైసీపీ నాయకులపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని నగరపాలక అధికారులు ప్రకటించారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 24, 2022, 9:56 PM IST