Vendi Ambari Utsav At Srikalahastiswara temple : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బెంగళూరుకు చెందిన దాతలు మల్లాది బాలసుబ్రమణ్యం, మల్లాది నాగేశ్వరరావు దంపతులు వెండి అంబారీలను వితరణగా అందజేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు అనుకూలంగా రూ.1.36 కోట్ల విలువైన వెండి అంబారీలను ఆలయానికి అందజేసిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంబారులకు పూజలు చేపట్టారు. అనంతరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా ఘనంగా వెండి అంబారీ ఉత్సవం నిర్వహించారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా ఘనంగా వెండి అంబారీ ఉత్సవం నిర్వహించారు. సోమ స్కంద మూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంభికా దేవి అమ్మవారు వెండి అంబారీలపై కొలువుదీరి మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన మిచ్చారు. ఉత్సవర్లు ముందు నంది ధ్వజపటాలం, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఆది దంపతులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ముందుకు సాగారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు, భజనలు కోలాటాలతో భక్తి భవాని చాటిచెప్పారు. మధ్యాహ్నం ఆలయంలో స్వామి అమ్మవారుల ధ్వజారోహణం నిర్వహించనున్నారు.