ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎలక్ట్రానిక్స్​లో వచ్చే నాలుగేళ్లలో 300 బిలియన్ డాలర్ల ఎగుమతులు.. కేంద్రమంత్రి రాజీవ్

By

Published : Sep 17, 2022, 9:00 AM IST

తిరుపతిలో ఏర్పాటు చేయనున్న లిథియం బ్యాటరీ తయారీ కేంద్రాన్ని కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ సందర్శించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ 2025-26 నాటికి 300 బిలియన్ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వివరించారు.

central minister
central minister

ఎలక్ట్రానిక్స్ రంగంలో 2025-26 నాటికి 300 బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు.... కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతిలోని ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో ఏర్పాటు చేయనున్న మొట్టమొదటి లిథియం బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఉన్న స్టార్టప్‌లు, వ్యవస్థాపకులకు చేయూత ఇవ్వడం ద్వారా లక్ష్యాలను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. భారతదేశాన్ని ఎలక్ట్రానిక్ తయారీకి గ్లోబల్ హబ్‌గా మార్చాలన్న ప్రధాని మోదీ దార్శనికతను సాకారం చేసేందుకు, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లు దిశా నిర్దేశం చేస్తున్నాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details