ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తితిదేలో 120 సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు.. 5 వేల మంది హాజరు - Compete for contract security jobs

TTD Security Jobs: తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో భద్రతా సిబ్బంది నియామక ప్రక్రియ రాష్ట్రంలోని నిరుద్యోగ తీవ్రతకు నిదర్శనంగా కనిపిస్తోంది. 11వేల రూపాయల వేతనంతో.. పని చేసేందుకు 102మంది సెక్యూరిటీ గార్డులను నియామకానికి లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి యువత పెద్ద సంఖ్యలో.. ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు తరలివచ్చారు.

TTD security  jobs
TTD security jobs

By

Published : Nov 17, 2022, 4:54 PM IST

Compete for contract security jobs: తిరుపతి తిరుమల దేవస్థానంలో పొరుగు సేవల విధానంలో సెక్యూరిటీ గార్డుల కొరకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాలు, విద్యాసంస్థలు ఆసుపత్రుల వద్ద సెక్యూరిటీ గార్డుల నియామకం కోసం.. లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ ఏజెన్సీ ఈ ప్రక్రియ చేపట్టింది. నెలకు రూ. 11వేలు జీతానికి 102 మంది సెక్యూరిటీ గార్డులను నియమించుకునేందుకు లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ ఏజెన్సీ నియామకం చేపట్టింది. ఈ ఉద్యోగాల కోసం రాష్ట్ర నలుమూలల నుంచి యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు.

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆవరణలో చేపట్టిన నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు 5 వేల మందికిపైగా యువకులు తరలివచ్చారు. ఏజెన్సీ సైతం ఊహించిన విధంగా.. యువకులు తరలి రావడంతో అదుపు చేయడం సాధ్యం కాక పోలీసుల సహకారం తీసుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్​తో పాటు తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా యువత తెల్లవారుజామున తిరుపతికి చేరుకుని.. ముందు వరుసలో నిలబడేందుకు పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో తోపులాట జరిగింది. రద్దీని చూసి కొందరు యువకులు నియామక ప్రక్రియలో పాల్గొనకుండానే.. వెనుతిరిగి వెళ్ళిపోయారు.

భద్రతా సిబ్బంది నియామక ప్రక్రియలో తోపులాటలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details