ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TTD: రేపు తితిదే ధర్మకర్తల మండలి సమావేశం..టైంస్లాట్‌ టోకెన్ల జారీపై నిర్ణయం? - తితిదే ధర్మకర్తల మండలి సమావేశం

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి.. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగనుంది. భక్తులకు సులువుగా స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు మెరుగైన సౌకర్యాలు అందించడంపైనే.. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

TTD trust board meeting
రేపు తితిదే ధర్మకర్తల మండలి సమావేశం

By

Published : Apr 29, 2022, 9:10 AM IST

TTD: తిరుమల, తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి.. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. ఈ సమావేశానికి బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు రానున్నారు. భక్తులకు సులువుగా స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు మెరుగైన సౌకర్యాలు అందించడంపైనే ప్రధానంగా చర్చించనున్నారు.

ఆధార్‌ కార్డుతో తిరుపతిలో ‘సమయ నిర్దేశిత (టైంస్లాట్‌) సర్వదర్శనం’ టోకెన్ల జారీతో పాటు ఏ టోకెనూ లేకుండా నేరుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి అనుమతించడం (సర్వదర్శనం)పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  • తిరుమలలో వారాంతపు రద్దీ కన్పిస్తోంది. గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోగా, నారాయణగిరిలోని ఏడు కాంప్లెక్స్‌ల్లోనూ భక్తులు వేచి ఉన్నారు. ఆళ్వార్‌ట్యాంకు వరకు బారులుదీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. తిరుమలలో నిన్న శ్రీవారిని 64,380 మంది భక్తులు దర్శించుకోగా.. 31,294 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.43 కోట్లు వచ్చినట్లు తితిదే తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details