TTD Proposals Rejected by The AP Government: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. తిరుపతి అభివృద్ధికి ఒక శాతం నిధి కేటాయించాలని తితిదే బడ్జెట్‌లో పేర్కొన్న ప్రతిపాదనను తిరస్కరిస్తూ.. దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ తితిదే ఈవోకు మెమో జారీ చేశారు. ఈ క్రమంలో ధార్మిక సంస్థల నిరసనతోనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, ఇది భక్తుల విజయమని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.
TTD Board of Trustees Meeting:అక్టోబర్ 10వ తేదీన తిరుమల అన్నమయ్య భవన్‌లో తితిదే ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. అందులో ప్రధానంగా.. ''తిరుపతి అభివృద్ధి కోసం తితిదే బడ్జెట్‌లో ఏటా ఒక శాతం నిధులను ఖర్చు చేసేందుకు నిర్ణయం. గోగర్భం డ్యాం వైపున ఓఆర్‌ఆర్‌లో రూ.18 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన క్యూలైన్లతోపాటు ఆహార కేంద్రాలు, మరుగుదొడ్లు, నారాయణగిరి విశ్రాంతిగృహం, ఆళ్వార్ ట్యాంకు రోడ్డు సర్కిల్ వద్ద రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం. తితిదే ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదన. భక్తులకు తక్కువ ధరకు నాణ్యమైన భోజనం అందించేందుకు రూ.2.93 కోట్లతో నారాయణగిరి క్యాంటీన్‌లో మూడో అంతస్తు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు టెండర్ల ఆమోదం.'' వంటి ప్రతిపాదనలతోపాటు మరికొన్ని కీలక ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించారు.
TTD Trust Board Meeting Decisions : తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు.. ధర్మకర్తల మండలి నిర్ణయం