TTD EO Press Conference: తిరుమలలో లడ్డూ బూందీ తయారీ కోసం రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన యంత్రాలను డిసెంబరు నాటికి అందుబాటులోకి తెస్తామని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఉదయం అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో మాట్లాడారు. తిరుమల మ్యూజియంను ప్రపంచ స్థాయిలో నిలిపేలా సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఆనంద నిలయం బంగారు తాపడం పనులను 6 నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు చెప్పిన ఈవో.. త్వరలో మరో తేదీని నిర్ణయిస్తామన్నారు. జనవరి నెలలో శ్రీవారికి 123.07 కోట్లు హుండీ ద్వారా ఆదాయం వచ్చిందని వెల్లడించారు. అదేవిధంగా 20.78 లక్షల మంది దర్శించుకున్నారని, 1.07 కోట్లు లడ్డూ విక్రయాలు జరగగా.. 37.38లక్షల మంది అన్నదాన భవనంలో ప్రసాదాన్ని స్వీకరించారన్నారు. తలనీలాలు 7.51 లక్షలు మంది సమర్పించారని తెలియజేశారు
జనవరిలో తిరుమల హుండీ ఆదాయం ఎంతంటే..! - latest news about tirumala
TTD EO Press Conference: తితిదే ఈవో ధర్మారెడ్డి డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. తిరుమలలో లడ్డూ బూందీ తయారీ కోసం 50 కోట్ల రూపాయలతో అత్యాధునిక సాంకేతికతో తయారు చేసిన యంత్రాలను డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇక నాణేలను లెక్కించడానికి, ప్యాకింగ్ కోసం కూడా యంత్రాలు రానున్నాయన్నారు.
తితిదే ఈవో ధర్మారెడ్డి
"గోవిందరాజ స్వామి ఆలయంలో మనం అనుకున్న సమయానికి బంగారు తాపడం పనులు పూర్తి కాలేదు. అందువలన బెస్ట్ సాంకేతికతో తయారు చేసే వారి కోసం చూస్తున్నాం. నాణేల లెక్కపెట్టడం, ప్యాక్ చేయడం ఆటోమెటిక్‌గా అయిపోతాయి". - ధర్మారెడ్డి, తితిదే ఈవో
ఇవీ చదవండి: