TTD EO DHARMAREDDY SON: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వాహక అధికారి ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (శివ) గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 28 ఏళ్ల చంద్రమౌళికి పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. కొన్నిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. రెండు కుటుంబాలవారు శుభలేఖలు పంచుతున్నారు. చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వానపత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డికి కుమారుడికి హార్ట్ఎటాక్.. శుభలేఖలు పంచడానికి వెళ్లి.. - టీటీడీ ఈవో ధర్మారెడ్డికి కుమారుడికి హార్ట్ఎటాక్
TTD EO DHARMAREDDY SON HEART ATTACK: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి అస్వస్థతకు గురయ్యారు. చంద్రమౌళికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి సంబంధించిన పనులలో భాగంగా చెన్నైలో శుభలేఖలు పంచుతున్న సమయంలో ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన బంధువులు ఆయనను సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు.
కాసేపటికే గుండెనొప్పిగా ఉన్నట్లు పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. వెంటనే శేఖర్‌రెడ్డి తదితరులు అక్కడకు చేరుకున్నారు. దీనిగురించి ధర్మారెడ్డి సన్నిహితులు ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. ‘వివాహ ఆహ్వానపత్రిక ఇవ్వడానికి వెళ్తుండగా చంద్రమౌళికి గుండెనొప్పి వచ్చింది. వెంటనే మధ్యాహ్నం 2.30 గంటలకు కావేరి ఆస్పత్రిలో చేర్పించాం. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మెల్లగా కోలుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ధర్మారెడ్డి దంపతులు సాయంత్రం 5.30 గంటలకు కావేరి ఆస్పత్రికి చేరుకున్నారు. చంద్రమౌళి ముంబయిలో ఉద్యోగం చేస్తున్నారని, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారని సమాచారం.
ఇవీ చదవండి: