ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి - TTD EO DHARMA REDDY SON DIED

ttd eo son death
ttd eo son death

By

Published : Dec 21, 2022, 9:35 AM IST

Updated : Dec 21, 2022, 10:25 AM IST

09:31 December 21

చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రమౌళి మృతి

TTD EO DHARMA REDDY SON DIED : తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి చెందారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు. పెళ్లి శుభలేఖలు పంచడానికి చెన్నైలోని బంధువుల ఇంటికి వెళ్లిన చంద్రమౌళి.. గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోవడంతో.. చంద్రమౌళి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

వచ్చే నెలలో వివాహం.. అంతలోనే ఇలా

చంద్రమౌళికి పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. కొన్నిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. రెండు కుటుంబాలవారు శుభలేఖలు పంచుతున్నారు. చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. కాసేపటికే గుండెనొప్పిగా ఉన్నట్లు పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని రోజుల్లోనే వివాహం జరగాల్సి ఉండగా చంద్రమౌళి మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 21, 2022, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details