TTD EO Dharma Reddy తితిదేకు సంబంధించిన మెచ్యూరిటీ పూర్తయిన ఐదు వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను రాష్ట్ర ప్రభుత్వం బాండ్స్ రూపంలో డిపాజిట్ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలు.. అవాస్తమని తితిదే ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ ఉదయం తిరుమల అన్నమయ్య డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో మాట్లాడిన అనంతరం.. ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. జాతీయ బ్యాంకుల్లో మాత్రమే తితిదే ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుందని దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. తితిదే ఫిక్స్డ్ డిపాజిట్లు విషయంలో ఎలాంటి వదంతలు నమ్మవద్దన్నారు. తిరుమల శ్రీవారికి సంబంధించిన మొత్తం 15,900 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు వివిధ జాతీయ బ్యాంకుల్లో ఉన్నాయన్నారు.
TTD EO Dharma Reddy: "ఆ వార్తలు అవాస్తవం...శ్వేతపత్రం విడుదల చేస్తాం" - తిరుమల తాజా వార్తలు
TTD EO Dharma Reddy: తితిదే ఫిక్స్డ్ డిపాజిట్ల నగదు విషయంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తమని తితిదే ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. జాతీయ బ్యాంకుల్లో మాత్రమే తితిదే ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుందని.. దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. తితిదే ఫిక్సిడ్ డిపాజిట్లు విషయంలో ఎలాంటి వదంతులు నమ్మవద్దన్నారు.
![TTD EO Dharma Reddy: "ఆ వార్తలు అవాస్తవం...శ్వేతపత్రం విడుదల చేస్తాం" TTD EO Dharma Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16843154-89-16843154-1667642728429.jpg)
తితిదే ఈవో ధర్మారెడ్డి
తితిదే ఈవో ధర్మారెడ్డి
హిందూ మత ద్వేషులు తితిదేపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. డిసెంబర్ 1 నుంచి ప్రయోగత్మకంగా విఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 8 గంటల నుంచి మొదలవుతుందని దీని వల్ల డిసెంబర్ నెల రూ.300 దర్శనం కోటా జాప్యం జరిగిందన్నారు. తిరుపతిలో ఇస్తున్న ఎస్ఎస్డీ టోకెన్లను ఇంకా పెంచాలని చాలా మంది భక్తులు కోరినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం వచ్చే పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: