ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TTD Chairman Bhumana Responded to Allegations: ఆరోపణలపై స్పందించిన టీటీడీ ఛైర్మన్​ భూమన.. 'ప్రత్యర్థులకు భయపడి వెనక్కి తగ్గను'

TTD Chairman Bhumana Responded to Allegations: తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై టీటీడీ చైర్మన్​ భూమన స్పందించారు. తాను విమర్శలకు భయపడి.. ఆరోపణలకు తలొగ్గి వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజాశ్రేయస్సు, ప్రజాసంక్షేమం, హిందు ధర్మ రక్షణ కోసమే పనిచేస్తానని తేల్చి చెప్పారు.

TTD_Chairman_Bhumana_Responded_to_Allegations
TTD_Chairman_Bhumana_Responded_to_Allegations

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 7:22 PM IST

TTD Chairman Bhumana Responded to Allegations: ఆరోపణలపై స్పందించిన టీటీడీ ఛైర్మన్​ భూమన.. 'ప్రత్యర్థులకు భయపడి వెనక్కి తగ్గను'

TTD Chairman Bhumana Responded to Allegations: తనపై వస్తున్న ఆరోపణలపై టీటీడీ ఛైర్మన్​ భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. తాను పదిహేడు సంవత్సరాల క్రితమే టీటీడీ ఛైర్మన్​గా ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి గుర్తు చేశారు. తిరుపతిలో నిర్వహించిన మూడు తరాల మనిషి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హిందూ ధర్మ వ్యాప్తి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు. ప్రత్యర్థులు చేసే విమర్శలకు భయపడి తాను వెనక్కితగ్గనన్న కరుణాకరరెడ్డి.. తాను చేస్తున్న పనులే తానేంటో నిరూపిస్తాయని తెలిపారు.

తాను గతంలో టీటీడీ ఛైర్మన్​గా సేవలు అందించిన సమయంలో 30వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించినట్లు వివరించారు. తనను క్రిస్టియన్​ అని, నాస్తికుడనని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వారికి తాను గతంలో చేసిన పనులే సమాధానమని ధ్వజమెత్తారు. దేవుని దయతో తిరుమల ఆలయ నాలుగుమాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం తాను తీసుకున్నదేనని గుర్తు చేశారు. 600వ అన్నమయ్య జయంతి ఉత్సవాలను నిర్వహించినట్లు వివరించారు. దళితవాడల్లో స్వామి వారి కళ్యాణోత్సవాలు జరిపించినట్లు తెలిపారు.

TTD Chairman Bhumana Karunakar Reddy comments శ్రీవారి భక్తుల రక్షణ కోసం..టీటీడీ కీలక నిర్ణయాలు

ఆరోపణలు భయపడి మంచి పనులు చేయటం, రాజకీయాలలో కొనసాగటం ఆపేది లేదన్నారు. తనది పోరాట నేపథ్యమేనని.. పోరాటాల నుంచి పైకి వచ్చిన వాడినే అని ఇలా ఆరోపణలకు భయపడనని స్పష్టం చేశారు. ఆరోపణలు చేసేవారు వారి రాజకీయ ప్రయోజనాల కోసం అనరాని మాటలు అంటున్నారన్నారు. తాను టీటీడీ పాలకమండలి అధ్యక్షుడిగా పనిచేసినట్లు గుర్తు చేశారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్​ ఏర్పాటు తన ఆలోచనే అని అన్నారు. వేద పాఠశాల స్థాపించటంలో అత్యంత కీలక పాత్ర పోషించినట్లు వివరించారు.

కొండపైకి కాలినడకన వెళ్లని భక్తులకు దివ్య దర్శన టికెట్ల పంపిణీ చేయాలని నిర్ణయం తనవల్లే అని చెప్పుకొచ్చారు. చతుర్యుగ బంధమనే పేరుతో గ్రామ గ్రామాన నాలుగు యుగాల పేర్లతో.. నాలుగు వేంకటేశ్వర స్వామి దేవాలయాలను ఏర్పాటు చేసింది కూడా తానేనని తెలిపారు.

వారసులు వద్దు.. మళ్లీ బరిలో మీరే.. వైకాపా నేతల్లో అంతర్మథనం

తాను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, విమర్శించాల్సిన పనిలేదని అన్నారు. వేంకటేశ్వర స్వామి కృప, ఆశీస్సులతో తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఆ పని హిందు ధర్మిక రక్షణ కోసం, సమాజ హితం కోసం, సమాజ శ్రేయస్సు కోసమేనని ప్రకటించారు.

సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాలు చేస్తున్నారు: తిరుమల శ్రీవారిపై భక్తి విశ్వాశాలను దెబ్బతీసే విధంగా సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. టీటీడీలో గడిచిన నాలుగు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, భక్తుల వసతుల కల్పనపై తీసుకున్న చర్యలను నెల రోజుల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్​ ద్వారా వివరిస్తామని ప్రకటించారు. టీటీడీపై విమర్శలు చేస్తున్న వారిలో స్థానికులు ఉన్నారని.. తిరుపతి వాసులు టీటీడీని తమ సొంతదానిలా భావించాలన్నారు. తిరుమల శ్రీవారి వల్లే తిరుపతి ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు.

"టీటీడీ ఛైర్మన్​గా 17సంవత్సరాల క్రితమే పనిచేశాను. నేను నాస్తికుడి అని, క్రైస్తవుడని మాట్లాడుతున్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్​ ఏర్పాటు నా ఆలోచనే. 600 అన్నమయ్య జయంతి ఉత్సవాలను నిర్వహించాను. వేంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ పాదరక్షలు ఉండాకూడదన్న నిర్ణయం కూడా నాదే." -భూమన కరుణాకరరెడ్డి టీటీడీ ఛైర్మన్

టీటీడీ ఛైర్మన్​గా భూమన :తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అగస్టు 10వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన టీటీడీ ఛైర్మన్​గా పదవీని స్వీకరించటం ఇది రెండోసారి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర రెడ్డి హయంలో 2006 నుంచి 2008 వరకు టీటీడీ ఛైర్మన్​గా భాద్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు.

Buchi ram prasad comments: భూమనకు టీటీడీ ఛైర్మన్ పదవా..?: టీీడీపీ కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్

ఎన్నికల అఫిడవిట్​లో భూమన క్రైస్తవుడని పేర్కొన్న అంశం గతంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అంతే కాకుండా ఆయన కుమార్తె వివాహం కూడా క్రైస్తవ మత సంప్రదాయంగా నిర్వహించారనే అరోపణలున్నాయి. దానికి సంబంధించిన వివరాలు కూడా సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

YCP Leaders Protests Against Bhumana as TTD Chairman టీటీడీ చైర్మన్​గా భూమనను వ్యతిరేకిస్తూ.. కీలక వైసీపీ నేత రాజీనామా!

ABOUT THE AUTHOR

...view details