TTD: తిరుమలలో భక్తులు అన్నప్రసాద కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా.. ఆయా ప్రాంతాల్లోనే అన్నప్రసాద వితరణ చేపట్టినట్లు.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కరోనా తగ్గడం, వేసవి సెలవులు కావడంతో.. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోందన్న ఆయన.. ఇందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కరోనా సమయంలో వివిధ విభాగాల్లో కుదించిన సిబ్బందిని.. భక్తుల సేవ కోసం తిరిగి నియమిస్తున్నామని చెప్పారు.
భక్తులు అన్నప్రసాద కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా.. ఆయా ప్రాంతాల్లోనే అన్నప్రసాద వితరణ చేపట్టామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రద్దు చేసిన బ్రేక్ దర్శనాలు.. తిరిగి ప్రారంభించినట్లు ధర్మారెడ్డి తెలిపారు.