Training On Natural Farming In Tirupati: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రతి జిల్లాలో రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల నుంచి నేల తల్లిని కాపాడటమే తమ ధ్యేయమన్నారు. తితిదే గోసంరక్షణ శాల ఆధ్వర్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ రైతులకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్నిఆయన ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులకు తితిదే గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తోందని అన్నారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపైన దృష్టి సారించాలని సూచించారు.
రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్న తితిదే ఛైర్మన్ - Tirupati News
TTD on Natural Farming: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తితిదే ప్రారంభించింది. ఈ శిక్షణ రెండు రోజులు ఉండనుందని తితిదే ఛైర్మన్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపైన రైతులు దృష్టి సారించాలని అన్నారు.
Etv Bharat