తిరుపతి జిల్లాలో అక్రమాలకు పాల్పడిన పోలీసు అధికారులను ఎస్పీ పరమేశ్వరరెడ్డి సస్పెండ్ చేశారు. రూ.20 లక్షల విలువైన సిగరెట్ల మాయంలో ప్రమేయం ఉందని తేలడంతో తిరుచానూరు సీఐ సుబ్రమణ్యం, ఎస్సైలు వీరేష్, రామకృష్ణ, రామకృష్ణారెడ్డిపై వేటు వేస్తూ ఆదేశాలు ఇచ్చారు. గోదాం నుంచి సిగరెట్లు పోయాయని ఐటీసీ మేనేజర్ ఫిర్యాదుతో ఎస్పీ పరమేశ్వరరెడ్డి విచారణకు ఆదేశించారు. సిగరెట్ ప్యాకెట్లు పక్కదారి పట్టించడానికి సదరు అధికారులు సహకరించినట్లు విచారణలో తేలింది. రూ.20 లక్షల విలువైన సిగరెట్ల మాయం కేసులో అధికారుల ప్రమేయం తేలడంతో చర్యలకు ఎస్పీ ఉపక్రమించారు.
అక్రమాలకు పాల్పడిన కేసులో తిరుచానూరు పోలీసు అధికారులపై వేటు - తిరుచానూరు సీఐ సుబ్రమణ్యం సస్పెండ్
అక్రమాలకు పాల్పడిన కేసులో తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీసు అధికారులపై వేటు పడింది. ఐటీసీ గోదాం నుంచి సిగరెట్ ప్యాకెట్‌ల మాయం కేసులో తిరుచానూరు సీఐ సుబ్రమణ్యం, ఎస్సైలు వీరేష్, రామకృష్ణ, రామకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ.. ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.
Thiruchanur CI Subramaniam suspended