ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడు కొండలవాడు.. ఆ కంపెనీల కంటే సూపర్‌ రిచ్‌ - The total property value of Tirumala Tirupati

The total property value of Tirumala Tirupati: తిరుమల శ్రీవారి మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.2.50 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీలైన విప్రో, ఎఫ్‌ఎంసీజీ కంపెనీ అయిన నెస్లే కంటే తితిదే ఆస్తుల విలువే ఎక్కువ కావడం గమనార్హం. స్టాక్‌ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం.. ప్రస్తుత మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుంటే అనేక భారత బ్లూచిప్‌ కంపెనీల కంటే వెంకటేశ్వర స్వామి ఆస్తే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

tirumala assets
tirumala assets

By

Published : Nov 6, 2022, 9:55 PM IST

value of Tirumala Tirupati:కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి ఆస్తుల విలువ తొలిసారి వెలుగులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.2.50 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీలైన విప్రో, ఎఫ్‌ఎంసీజీ కంపెనీ అయిన నెస్లే కంటే తితిదే ఆస్తుల విలువే ఎక్కువ కావడం గమనార్హం. ప్రభుత్వరంగ కంపెనీలైన ఓఎన్‌జీసీ, ఐఓసీ సైతం శ్రీవారి ఆస్తుల ముందు దిగదుడుపే.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తిరుమల శ్రీవారి ఆస్తులతోపాటు నగదు, బంగారం డిపాజిట్లు, ఆభరణాల మొత్తం విలువను తితిదే శనివారం తెలియజేసింది. 1933 తర్వాత తొలిసారి విలువను వెల్లడిస్తూ శ్వేతపత్రం జారీ చేసింది. ఇందులో 10.25 టన్నుల బంగారం డిపాజిట్లు, 2.5 టన్నుల బంగారు ఆభరణాలు, వివిధ బ్యాంకుల్లో రూ.16వేల కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 960 ఆస్తులు ఉన్నట్లు తితిదే వెల్లడించింది. ఈ మొత్తం విలువ రూ.2.5 లక్షల కోట్ల అంచనా వేస్తున్నారు. స్టాక్‌ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం.. ప్రస్తుత మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుంటే అనేక భారత బ్లూచిప్‌ కంపెనీల కంటే వేంకటేశ్వర స్వామి ఆస్తే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

బెంగళూరుకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.2.14 లక్షల కోట్లుగా ఉంది. దేశంలో అతిపెద్ద సిమెంట్‌ కంపెనీ అయిన అల్ట్రాటెక్‌ మార్కెట్‌ విలువ సైతం రూ.1.99 లక్షల కోట్లు, నెస్లే విలువ రూ.1.96 లక్షల కోట్లుగా మాత్రమే. దేశంలోనే అతిపెద్ద చమురు కంపెనీలైన ఓఎన్‌జీసీ, ఐఓసీ ఆస్తుల విలువ సైతం శ్రీవారి ఆస్తుల విలువ కంటే తక్కువే. ఇవే కాదు ఎన్టీపీసీ, మహీంద్రా అడ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, వేదాంతా, డీఎల్‌ఎఫ్‌ వంటి కంపెనీలు సైతం చాలా దూరంలో నిలిచాయి.

ఇవే టాప్‌ కంపెనీలు:మార్కెట్‌ విలువ పరంగా రెండు డజన్ల కంపెనీలు మాత్రమే తితిదే కంటే ఆస్తుల విలువ కంటే ముందున్నాయి. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (రూ.17.53 లక్షల కోట్లు), టీసీఎస్‌ (రూ.11.76 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (రూ.8.34 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్‌ (రూ.6.37 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (రూ.6.31 లక్షల కోట్లు), హిందుస్థాన్‌ యూనిలీవర్‌ (రూ.5.92 లక్షల కోట్లు), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (రూ.5.29 లక్షల కోట్లు), భారతీ ఎయిర్‌టెల్‌ (రూ.4.54 లక్షల కోట్లు), ఐటీసీ (రూ.4.38 లక్షల కోట్లు) వంటి కంపెనీలు అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీలుగా కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details