Tirumala Srivari Brahmotsavam 2023 Arrangements :శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు ముస్తాబయ్యాయి. ఈ ఏడాది సాలకట్ల,వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో నేడు సాలకట్ల బ్రహ్మోత్సవాలకు (Srivari Salakatla Brahmotsavam) అంకురార్పణ చేయనున్నారు. ఈ నెల 26 వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు శ్రీవారు ఉదయం, రాత్రి వేళల్లో వాహన సేవలో తిరు వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు . బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 26 వరకు ఆర్జిత సేవలను రద్దు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రద్దు చేసింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి నిర్దేశిత వాహన సేవకు మాత్రమే అనుమతించనున్నారు.
Srivari Brahmotsavams at Tirumala September 18 to 26 :సెప్టెంబర్ 22న గరుడ సేవ (Garuda Vahana Seva on 22nd) జరగనుంది. వేలాది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలకు 4 వేల మంది పోలీసు సిబ్బందిని నియమించారు. పోలీసులతో పాటు స్పెషల్ పార్టీలు, బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తిరుమల సహా రెండు ఘాట్ రోడ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
Tirumala Brahmotsavalu 2023 Updates: తిరుమలలో ఈ నెల 18నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి
తిరుమల మొత్తం సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. చిన్నారులు, వృద్ధులకు జియో ట్యాగింగ్ చేయనున్నారు. బహ్మోత్సవాల సందర్భంగా కొండపైకి 24 గంటలూ ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. తొమ్మిది రాష్ట్రాల నుంచి కళ బృందాలు మాడ వీధుల్లో నృత్య ప్రదర్శనలు చేస్తారన్నారు. ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటల నుంచి వాహన సేవలు ప్రారంభం అవుతాయన్నారు.గరుడ సేవ రోజునా రాత్రి 7 గంటలకు వాహన సేవా మొదలై భక్తులందరు వీక్షించే అంతవరకు వాహన సేవా ఉంటుందని అధికారులు తెలిపారు.
పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ : ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామి వారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని,సెప్టెంబరు 18 నుంచి 26వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు.అలాగే అక్టోబర్ 14 నుంచి 22వ తేది వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.సెప్టెంబరు 18వ తేదిన శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పిస్తారన్నారు.
Tirumala Brahmotsavam Arrangements: ఈ నెల 18 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేశామన్నారు. సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన విధానాన్ని అమలు చేస్తామన్నారు. భక్తులకు వసతులు భద్రతపై అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు.. సీఎం తిరుమలకు రావడంతో పోలిసులు కట్టుదిట్టమైన భదత్ర చర్యలు చేపట్టున్నారు..
బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా మరోసారి టీటీడీ భద్రతా వైఫల్యం బయటపడింది. ధ్వజారోహణానికి ఉపయోగించే దర్బచాప, తాడను అటవీశాఖ అధికారులు ఊరేగింపుగా తీసుకొచ్చి మహాద్వారం వద్ద అందజేశారు. వాటిని తితిదే సిబ్బంది ఆలయంలోకి తీసుకెళ్తుండగా లోపలి నుంచి బయటకు వచ్చే భక్తులు, బయట ఉన్న తమ వారి దగ్గర నుంచి సెల్‌ఫోన్ తీసుకుని వాటిని చిత్రీకరించారు. వెంటనే గమనించిన విజిలెన్స్ అధికారులు భక్తులను అదుపులోకి తీసుకుని సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Tirumala Darshanam : తిరుమల భక్తులకు షాక్.. రద్దు నిర్ణయం తీసుకున్న టీటీడీ..!
Tirumala Srivari Brahmotsavam 2023 : బ్రహ్మోత్సవానికి సిద్ధమైన తిరుమల శ్రీవారు..నేడు సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ