ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TTD BOARD MEET: తితిదే అవసరాలకు 12 రకాల ప్రకృతి వ్యవసాయోత్పత్తులు

TTD BOARD MEETING: తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ మీటింగ్​లో తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్యకళాశాలలో ఐసోలేషన్ వార్డుల నిర్మాణాలకు రూ.53.62 కోట్లు మంజూరు చేసినట్లు తితిదే అధికారులు వెల్లడించారు. తితిదే అవసరాలకు 12 రకాల ప్రకృతి వ్యవసాయోత్పత్తులు కొనుగోలుపై చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ttd board meeting
తితిదే ధర్మకర్తల మండలి సమావేశం

By

Published : Apr 15, 2023, 10:22 PM IST

TTD BOARD MEETING: తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలలో టీబీ, ఛాతీ, చర్మం వంటి ఇతర ఐసోలేషన్ వార్డుల నిర్మాణ పనుల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తితిదే చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందుకోసం రూ.53.62 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ రోజు స్థానిక అన్నమయ్య భవనంలో వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి పలువురు మండలి సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తుల కొనుగోలు ధరల నిర్ణయంపై, మార్క్ ఫెడ్, రైతు సాధికార సంస్థ​తో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలిపిరి వద్ద మార్కెటింగ్‌ గిడ్డంగుల నూతన గోడౌన్ల నిర్మాణానికి రూ.18 కోట్లు, కోల్డ్‌ స్టోరేజి నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు చేశామని చెప్పారు.

తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థల్లో రెగ్యులర్‌ బోధనా సిబ్బంది నియామకాన్ని ఆమోదిస్తూ.. ఇప్పటికే పని చేస్తున్న కాంట్రాక్ట్ బోధనా సిబ్బందిని కొనసాగిస్తూనే రెగ్యులర్ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఎఫ్​సీఆర్​ఏ అధికారుల సూచన మేరకు త్వరగా లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.3 కోట్లు చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. చెల్లించిన రూ. 3 కోట్ల నగదును తిరిగి పొందేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను మంజూరు చేసే నిర్ణయం తీసుకున్నారు.

వైవీ సుబ్బారెడ్డి

"తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలలో టీబీ, ఛాతీ, చర్మం వంటి ఇతర ఐసోలేషన్ వార్డుల నిర్మాణం పనులు చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నాము. ఇందుకోసం రూ. 53.62 కోట్లు మంజూరు చేశాము. దీంతోపాటు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు ధరల నిర్ణయంపై రైతు సాధికార సంస్థ, మార్క్ ఫెడ్​తో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేశాము. అలిపిరి వద్ద మార్కెటింగ్ గిడ్డంగుల నూతన గోడౌన్ల నిర్మాణానికి రూ.18 కోట్లు, కోల్డ్ స్టోరీజి నిర్మాణానికి రూ. 14 కోట్లు మంజూరు చేశాము. దీంతోపాటు తితిదే విద్యా సంస్థల్లో రెగ్యులర్ బోధనా సిబ్బంది నియామకాన్ని ఆమోదించాం" -వైవీ సుబ్బారెడ్డి, తిరులమ తిరుపతి దేవస్థానం ఛైర్మన్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details