TIRUMALA: కరోనా పరిస్థితుల అనంతరం తిరుమల శ్రీవారికి భారీగా హుండీ కానుకలు లభిస్తున్నాయి. రెండు సంవత్సరాల తరువాత స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తిరుమలకు వస్తున్నారు. దీంతో హుండీ కానుకలు అత్యధికంగా లభిస్తున్నాయి. మార్చి నెలలో రూ.128 కోట్లు, ఏప్రిల్‌లో రూ.127.5 కోట్లు, మేలో రూ.129.93 కోట్లు, జూన్‌లో రూ.120 కోట్లు, జులైలో 23వ తేదీ వరకు రూ.106.4 కోట్లు లభించాయి. భక్తుల నుంచి ఇదే తరహాలో హుండీ కానుకలు లభిస్తే స్వామివారికి ఈ ఏడాది రూ.1500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తితిదే గణాంకాధికారులు అంచనా వేస్తున్నారు.
TIRUMALA: శ్రీవారికి భారీగా పెరుగుతున్న హుండీ కానుకలు..వరుసగా ఐదో నెలా రూ.100కోట్లు పైనే - తిరుమల తాజా వార్తలు
TIRUMALA: కరోనా తర్వాత శ్రీవారికి హుండీ కానుకలు భారీగా లభిస్తున్నాయి. మార్చి నెల నుంచి ఇప్పటివరకు నెలనెలా రూ. 100 కోట్లకు పైనే కానుకలు వస్తున్నాయి. భక్తుల నుంచి ఇదే తరహాలో హుండీ కానుకలు లభిస్తే స్వామివారికి ఈ ఏడాది రూ.1500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తితిదే గణాంకాధికారులు అంచనా వేస్తున్నారు.
TIRUMALA
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతుండడంతో.. స్వామి వారిని దర్శించుకోవడానికి 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని 78,479 మంది భక్తులు దర్శించుకోగా.. 37,521 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి: