TIRUMALA BRAHMOTSAVAM : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు చినశేషవాహనంపై తిరుమల మాఢ వీధుల్లో స్వామి వారు విహరించారు. మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో భక్తులకు కనువిందు చేశారు. స్వామివారి వైభవాన్ని కనులారా చూసేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
సాయంత్రం హంస వాహన సేవ : ఈరోజు సాయంత్రం 7గంటలకు స్వామివారు వీణాపాణియై.. సరస్వతీదేవి రూపంలో హంసతూలికా వాహనంపై విహరిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని(శరణాగతి) కలిగిస్తాడు.