Tirumala Brahmotsavalu: మంగళవారం నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే 100 డయల్ చేయలని.. 14 పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నాలుగు వేల మందితో భద్రత కల్పిస్తున్నామని, గరుడ సేవ రోజు మరో రెండు వేల మందితో భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. వృద్ధులు, చిన్నపిల్లలకు జియో ట్యాగింగ్లు ఏర్పాటు చేసి రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు.
భద్రత చర్యల కోసం ముగ్గురు అదనపు ఎస్పీలు, 28 డీఎస్పీలు, సీఐలు 111, ఎస్ఐలు 273, ఏఎస్ఐలు, హెచ్సీలు 979, మహిళా పోలీసులు 141, పీసీలు 2,076, స్పెషల్ పార్టీలు 121, ఏఆర్, ఏపీఎస్పీ, ఆక్టోపస్ ఇంటెలిజెన్స్ 1,100 సిబ్బంది బ్రహ్మోత్సవ సేవల కోసం పాల్గొననున్నారని ఎస్పీ తెలిపారు.