శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, ఎనిమిది మందికి తీవ్రగాయాలు - srikalahasthi news
23:12 April 24
Accident in Tirupati District: తిరుపతి జిల్లాలో ఘటన
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేణిగుంట-నాయుడుపేట ప్రధాన రహదారిపై మినీ వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 8మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమించటంతో వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన 12 మంది నాయుడుపేట సమీపంలోని కనుపూరుమ్మ ఆలయాన్ని దర్శించుకుని.. మినీ వ్యాన్‌లో తిరుపతికి బయల్దేరారు. శ్రీకాళహస్తిలోని అర్ధనారీశ్వర స్వామి ఆలయం సమీపంలోకి రాగానే వీరి వాహనాన్ని.. ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అర్జునయ్య(65), సరసమ్మ(60) దంపతులతో పాటు మారెమ్మ అలియాస్ కావ్య(25), ధరణి(10) మృతి చెందారు. వారితో ప్రయాణిస్తున్న గోపి, దిల్లీ రాణి ,కవిత, ఆనంద్, శ్రీనివాసులుతో పాటు పిల్లలు భవీఫ్, మోక్షిత, ధనుష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి