Firing on Journalist: అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ శ్రీధర్ విలేకరిపై కాల్పులు జరిగిన సంఘటనను పోలీసులు ఛేదించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో గత నెల 31వ తేదీ సాయంత్రం ఓ ఛానల్ విలేకరిపై కాల్పులు జరిగిన వివరాలు వెల్లడించారు. దీనిలో భగంగా డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం పీలేరులో ఓ ఛానల్ విలేకరిగా పని చేస్తున్న పర్వత రెడ్డిపై నెల 31వ తేదీ రాయచోటి పట్టణంలోని శివాలయం కూడలిలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని తెలిపారు. అయితే తీవ్రంగా గాయపడిన పర్వత రెడ్డి తనకు బస్సు టైర్ నుంచి జారీ వచ్చిన రాయి తగిలి గాయమైందని భావించి కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాలనుకున్నారు. అక్కడ వైద్యులు శరీరంలో బుల్లెట్ ఉందని స్కానింగ్ ద్వారా తేల్చడం తో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించి ఎక్కడ బుల్లెట్ వెలికితీశారని అన్నారు.
దీంతో బాధితుడు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఐతే గోశాలను కలిగి ఉన్న పర్వత రెడ్డి ప్రొద్దుటూరు కడప ప్రాంతాల నుంచి ఆవులు గేదెలను అక్రమ రవాణా చేస్తున్న వారి వాహనాలను రోడ్లపై నిలిపి బెదిరింపులతో అక్రమ వసూల్లకు పాల్పడేవాడని డీఎస్పీ వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే ప్రొద్దుటూరు చెందిన బీఫ్ వ్యాపారి మహమ్మద్ ఇలియాస్ నుంచి పర్వత రెడ్డి రూ 5 లక్షలు తీసుకొని అతని వాహనాలు ఎక్కడ నిలపకుండా చూసుకుంటానని చెప్పినట్లు డీఎస్పీ వ్యాఖ్యానించారు. అయితే కొంతకాలం తర్వాత మహమ్మద్ ఇలియాస్ తరలింపు రూట్ ను మార్చుకోవడంతో ముందుగా ఇచ్చిన ఐదు లక్షలు తనకి ఇచ్చేయాలని పర్వత రెడ్డిలు కోరినట్లుగా చెప్పారు.