Temples Throng with Devotees During Vaikuntha Ekadashi:వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వెంకటేశ్వరస్వామి దర్శనార్థం భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి
Tirumala:తిరుమలలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శన శోభ మొదలైంది. శ్రీవారి ఆలయాన్ని రకరకాల పుష్పాలతో టీటీడీ ఉద్యానవన శాఖ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రముఖులు, సామాన్య భక్తులతో తిరుమల కిటకిటలాడింది. భక్తుల తాకిడి దృష్ట్యా ముందుగానే తిరుపతిలో టోకెన్లను సామాన్య భక్తులకు టీటీడీ జారీ చేసింది. రూ.300 ప్రత్యేక దర్శనం, సర్వదర్శన టికెట్ల స్లాటెడ్ దర్శనాలను నిర్దేశించిన సమయం కంటే 45 నిమిషాల ముందే ప్రారంభించామని, తెల్లవారు జామున 1:30 నిమిషాలకు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులను అనుమతించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మొత్తం 4,008 వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లు జారీ చేశామన్నారు. క్యూలో వచ్చే భక్తులకు పాలు కాఫీ, అల్పాహారం అందిస్తున్నామన్నారు. ఏ చిన్న సమస్య రాకుండా ఈ సారి పటిష్ఠమైన ఏర్పాట్లు చేశామని అన్నారు.
'అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణ అందుకే' - డిసెంబర్ 23నుంచి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం : టీటీడీ ఈవో
Visakhapatnam:విశాఖ సింహాచలంసింహాద్రి అప్పన్న సన్నిధిలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామివారికి సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించి ఉత్తర ద్వారంలో దర్శన భాగ్యం అధికారులు కల్పించారు. భక్తుల సౌకర్యార్థం రూ.500, రూ.300 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచారు సుమారు 60 వేల మంది భక్తులు దర్శించుకుంటారని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర ద్వారంలో స్వామివారి ఉదయం 11:30 వరకు భక్తులకు దర్శనం ఇవ్వరున్నారు. ఆదిశేష వాహనంపై ఉభయ దేవరులతో స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. అనంతరం స్వామికి వైభవంగా తిరువీధి నిర్వహించనున్నారు. ముందుగా ద్వార దర్శనమునకు విచ్చేసిన ఆలయ చైర్మన్ అశోక్ గజపతి రాజుకి వారు ఆలయ కార్యనిర్వహణాధికారి స్వాగతం పలికారు.