Tirumala Room Rents Issue: తిరుమలలో వసతి గదుల అద్దెను పెంచడాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. తిరుపతిలోని గోవిందరాజ స్వామి సత్రాల వద్ద మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెంచిన గదుల అద్దె ధరలను తితిదే వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సామాన్య భక్తులు బస చేసే వసతి గదుల అద్దెను పెంచిన తితిదే.. వీఐపీలు దిగే గదుల ధరలు మాత్రం ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని పెంచిన అద్దె ధరలను తగ్గించేలా చూడాలన్నారు. భక్తులకు సౌకర్యాలను కల్పించడంలో తితిదే విఫలమయిందని ఆరోపించారు. సామాన్య భక్తులు బస చేసే వసతి గదుల అద్దెను పెంచిన తితిదే వీఐపీలు దిగే గదుల ధరలు మాత్రం ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. భక్తుల కానుకలతో సామాన్యులకు వసతులు కల్పించడంలో తితిదే విఫలమైందని ఆరోపించారు.
తిరుమల తిరుపతి దేవస్ధానాన్ని వ్యాపార సంస్థగా మార్చేశారు. నిన్నటి రోజున నారాయణగిరి గెస్ట్ హౌజ్లో కానివ్వండి, తిరుమలలో కానివ్వండి గదుల అద్దెను పెంచడం దీనికి నిదర్శనం. రూ.150 నుంచి రూ.1500 పెంచారు. ఏమైనా అంటే మేము మరమ్మతులు చేశామంటున్నారు. అక్కడికి వచ్చేవాళ్లంతా మధ్య తరగతి ప్రజలు.. రూ.500 జేబులో పెట్టుకొని ఓ రూ. 200 గదికి ఒక రూ.200 బస్ ఛార్జీకి అని.. ఓ రూ.100 ఖర్చులకని పెట్టుకొని యాత్రికులు, భక్తులు వస్తుంటే వీళ్లేమో ప్రతీది వ్యాపారం చేస్తున్నారు. - సుగుణమ్మ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే