NARA LOKESH YUVAGALAM : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 19వ రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. నారాయణవనం మండలం ఎత్తలతడుకు నుంచి నేటి పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు విడిది కేంద్రంలో సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమం నిర్వహించారు ఇందులో పలువురు స్ధానికులు, యువత.. లోకేశ్‌తో కలిసి స్వీయచిత్రాలు తీసుకున్నారు. అనంతరం వెదురు బుట్టలు అల్లే కార్మికులతో విడిది కేంద్రంలో మాట్లాడి.. సమస్యలను తెలుసుకున్నారు.
తిరుపతిలో యువగళం పాదయాత్ర.. గాజులు తయారు చేసే మహిళలతో లోకేశ్ మాటామంతి - Lokesh 19th day yuvagalam padayatra
LOKESH YUVAGALAM : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. సత్యవేడు నియోజకవర్గంలోని విత్తలతడుకు నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
LOKESH YUVAGALAM
అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్... అరణ్యం కండ్రి సమీపంలోని దాసరి ఇళ్ల వద్ద మట్టి గాజులు తయారు చేసే మహిళలతో ముచ్చటించారు. గతంలో మట్టి గాజులు తయారు చేసే మహిళా గ్రూపులకు ప్రభుత్వం 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందేదని, ప్రస్తుతం ఆ సహయం నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలలు లోకేశ్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలతో మాట్లాడిని లోకేశ్ వారికి భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి: