Two Storey Buildng Dontion to TTD: తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలూకా కొడివలస గ్రామానికి చెందిన రిటైర్డ్ నర్సు ఎన్.కె. నెమావతి.. తమ గ్రామంలో కొత్తగా నిర్మించిన రెండు అంతస్తుల భవనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందజేశారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా సుమారు రూ.70 లక్షల విలువైన ఆస్తిని శ్రీవారికి విరాళంగా అందజేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలోని తితిదే ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి మల్లికార్జునకు ఆమె ఇంటి పత్రాలు, తాళాలను అందజేశారు. ఆ ఇంటి విలువ దాదాపు రూ.70 లక్షల వరకు ఉంటుందని ప్రత్యేకాధికారి మల్లికార్జున పేర్కొన్నారు.
తితిదేకు రెండు అంతస్తుల భవనం విరాళం.. విలువ ఎంతంటే? - Donation of two storied building
Two Storey Buildng Dontion to TTD : తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తురాలు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రోజున భారీ విరాళాన్ని అందజేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ నర్సు ఎన్.కె. నెమావతి.. కొత్తగా నిర్మించిన రెండు అంతస్తుల భవనాన్ని శ్రీవారికి విరాళంగా ఇచ్చారు. ఆ ఇంటి విలువ దాదాపు రూ.70 లక్షల వరకు ఉంటుందని తితిదే ప్రత్యేకాధికారి మల్లికార్జున తెలిపారు.
తితిదేకి రెండు అంతస్తుల భవనం విరాళం