ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కోళ్ల పరిశ్రమకు సుందర నాయుడి సేవలు ఎనలేనివి' - సుందరనాయుడు

Sundaranaidu: కోళ్ల పరిశ్రమ ఉన్నంత కాలం సుందరనాయుడు.. రైతుల మనసుల్లో జీవించే ఉంటారని.. ప్రముఖులు, రైతులు కొనియాడారు. కోళ్ల పరిశ్రమకు ఆయన అందించిన సేవల్ని గుర్తుచేసుకున్నారు. కోళ్ల రైతుల ఆధ్వర్యంలో చిత్తూరులో నిర్వహించిన సుందరనాయుడు సంస్మరణ సభలో.. ఆయన కుటుంబసభ్యులు, రైతులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఆయనకు నివాళులు అర్పించారు.

sundaranaidu
sundaranaidu

By

Published : Jul 25, 2022, 3:05 AM IST

Updated : Jul 25, 2022, 3:26 AM IST

Sundaranaidu Remembrance Meeting: బాలాజీ హేచరీస్‌ వ్యవస్థాపకుడు, పౌల్ట్రీ రంగ దిగ్గజం.. సుందరనాయుడు సంస్మరణ సభను... చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. కోళ్ల రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి కోళ్ల రైతులు, పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు, సుందరనాయుడు కుమార్తెలు శైలజాకిరణ్‌, నీరజ, అల్లుడు నవీన్‌, మనవడు ప్రణీత్‌, మనవరాళ్లు సహరి, బృహతి, అమరరాజా సంస్థల వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు సహా పలువురు ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. కోళ్ల పరిశ్రమ అభ్యున్నతికి సుందరనాయుడు చేసిన సేవల్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం సుందరనాయుడు జీవిత విశేషాలను ప్రదర్శించారు.

సుందరనాయుడు సంస్మరణ సభ

'ఆయన వల్లే రైతుల ఆదాయం పెరిగింది'.. సుందరనాయుడుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు పారిశ్రామికవేత్త గల్లా రామచంద్రనాయుడు. సుందరనాయుడి కృషి వల్ల... రైతుల ఆదాయం పెరిగిందని.. తద్వారా పిల్లల్ని చదివించి మంచి స్థాయిలో ఉన్నారని కొనియాడారు. విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ... సుందరనాయుడు సంస్మరణ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. సుందరనాయుడు చూపిన బాటలో నడవడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని ఆయన అన్నారు.

.

'వ్యాపారంలో ఎక్కువమందికి సేవ చేయవచ్చనే'..ఉద్యోగం కంటే వ్యాపారంలో ఎక్కువమందికి సేవ చేయవచ్చనే భావంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ప్రజలు, రైతుల బాగుకు కృషి చేసిన వ్యక్తి సుందరనాయుడని... ఆయన కుమార్తె, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు. కోళ్ల రైతుల పరిస్థితి దిగజారకుండా ఉండేందుకు ఎంతో సాయం చేశారని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా కుటుంబసభ్యులుగా తమ వంతు కృషి చేస్తామన్నారు. మొదటి వర్ధంతి సమయానికి ఆయన జీవితచరిత్రను పుస్తక రూపంలోకి తెస్తామని తెలిపారు. సుందర నాయుడు ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్య అందించే దిశగా కృషి చేస్తామన్నారు.

సుందరనాయుడు స్ఫూర్తిని, పట్టుదలను ఆయుధంగా మార్చుకుని... కోళ్ల రైతుల కుటుంబాలను అభివృద్ధి చేస్తామని... నెక్​ చిత్తూరు జోనల్‌ ఛైర్మన్‌ రమేశ్‌బాబు అన్నారు. రెడ్‌క్రాస్‌ సంస్థకు సుందరనాయుడు చేసిన సేవల్ని స్మరించుకుంటూ.. గవర్నర్ సంతకం చేసిన ప్రశంసాపత్రాన్ని ఏపీ రెడ్‌క్రాస్‌ ఛైర్మన్ శ్రీధర్‌రెడ్డి.. మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌కు అందజేశారు. సుందరనాయుడు సంస్మరణ సభ సందర్భంగా.. కోళ్ల రైతులు రక్తదానం చేశారు.

ఇవీ చదవండి:బాలాజీ హేచరీస్ అధినేత సుందరనాయుడు శుభస్వీకరణ కార్యక్రమం

Sundar naidu: అశ్రునయనాల మధ్య బాలాజీ హేచరీస్ అధినేత సుందరనాయుడు అంత్యక్రియలు

Last Updated : Jul 25, 2022, 3:26 AM IST

ABOUT THE AUTHOR

...view details