ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరిలో మరోసారి గంజాయి కలకలం.. ప్రభుత్వ పాఠశాలే అడ్డా - గంజాయి కలకలం

Ganja : తిరుపతి జిల్లా చంద్రగిరిలో మరోసారి గంజాయి కలకలం సృష్టించింది. గతంలో గంజాయి విక్రయాలు జరిగాయని వెలుగులోకి వచ్చింది. అప్పుడు విచారణలో గంజాయి ఏమీ లేదని తేలింది. ఇప్పుడు మరోసారి కలకలం సృష్టించటంతో గంజాయి విక్రయాలు ఆగలేదనే అనుమానాలు బలపడుతున్నాయి.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 2, 2023, 2:52 PM IST

Ganja In Chandragiri : మాయమైపోయిందనుకున్న గంజాయి.. చంద్రగిరిని వదలటం లేదు. మళ్లీ గంజాయి ఆనవాళ్లు చంద్రగిరిలో వెలుగులోకి వచ్చాయి. యువతే లక్ష్యంగా గంజాయి ముఠాలు విక్రయాలు కొనసాగిస్తున్నాయి. గంజాయికి బానిసవుతున్న విద్యార్థులు మత్తులో పెడదారి పడుతున్నారు. బంగారు భవిష్యత్​ ఉన్న యువత గంజాయి విక్రయాలు పెరగటంతో ఆ మత్తులో జోగుతున్నారు.

తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అవరణ అసాంఘిక కార్యకాలపాలకు నెలవుగా మారింది. పాఠశాల చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఖాళీ మద్యం సీసాలు, గుట్కా, ప్యాకెట్లు, వినియోగించిన గంజాయి ప్యాకెట్లే దర్శనమిస్తున్నాయి. గురువారం రోజు పాఠశాల వెనక ఉన్న ప్రహరీ గోడపై కొందరు విద్యార్థులు పట్టపగలే గంజాయి సేవిస్తూ మీడియా కళ్లకు చిక్కారు. మీడియాను గమనించిన విద్యార్థులు అక్కడి నుంచి పరారయ్యారు.

పాఠశాలకు దగ్గరలో ఇంటర్​ కళాశాలలు ఉన్నాయి. ఆ కళాశాలల విద్యార్థులే.. తరగతులకు హాజరు కాకుండా గంజాయి సేవిస్తున్నారు. పాఠశాల అవరణలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని.. పాఠశాల, కళాశాల యాజామాన్యాలు పోలీసులకు సమాచారం ఇచినా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో గంజాయి విక్రయాలు పెరిగాయని చెప్పటానికి గురువారం జరిగిన ఘటనే ఉదాహరణ. ఇలా గంజాయి సేవిస్తూ యువత పెడదోవ పడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి గట్టి నిఘా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గతంలో చంద్రగిరిలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయని ప్రచారంలోకి వచ్చాయి. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో చంద్రగిరిలో గంజాయి విక్రయాలు లేవని తేల్చి చెప్పారు. ఈ విచారణ తూతూమంత్రంగా సాగిందనే ఆరోపణలు ఉన్నాయి.

చంద్రగిరి మండలంలో యువతను కేంద్రంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగుతున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. గంజాయిని విక్రయిస్తున్న మహిళను, ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన ఘటనలు ఉన్నాయి. కర్ణాటక నుంచి తిరుపతి తరలిస్తున్న లక్షల విలువైన గంజాయిని సైతం పోలీసుల దాడులలో స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరిలోని బాలుర కళాశాల మైదానం, బ్రహ్మంగారి గుడి ప్రాంతాలలో యువత గంజాయి సేవించడానికి అడ్డాలుగా మారాయనే ఉదంతాలు ఉన్నాయి. గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో.. విద్యార్థుల నుంచి పోలీసులు దాదాపు 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ఘటనలు ఉన్నాయి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details