ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవంతమైన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 రాకెట్ ప్రయోగం.. కక్ష్యలోకి మూడు ఉపగ్రహలు

SSLV D 2 : సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. చెన్నై స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా అధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు రూపొందించిన ఉపగ్రహన్ని మరో రెంజు ఉపగ్రహలను కక్ష్యలో ప్రవేశపెట్టటంతో ప్రయోగం పూరైంది.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 10, 2023, 7:10 AM IST

Updated : Feb 10, 2023, 9:46 AM IST

SHAR : తిరుపతి జిల్లాలో గల సతీశ్‌ధావన్‌ స్పేస్‌సెంటర్‌ నుంచి చేపట్టనున్న చిన్న ఉపగ్రహ వాహకనౌక ప్రయోగం విజయవంతమైంది. దీని ఏర్పాట్లను ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ పర్యవేక్షించారు. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం వేకువజామున 2.48 గంటలకు ప్రారంభం కాగా.. ఉదయం 6.30 గంటల వరకు కొనసాగింది. ఉదయం 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2) నింగిలోకి బయలుదేరింది. నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2.. భారత్‌కు చెందిన 2 ఉపగ్రహాలు అమెరికాకు చెందిన 1 ఉపగ్రహన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో ఈ ప్రయోగం పూర్తైంది.

గురువారం రిహార్సల్స్‌ నిర్వహించిన శాస్త్రవేత్తలు.. రాకెట్‌ పనితీరు బాగుందని నిర్ధారించుకున్నారు. అనంతరం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో రాకెట్‌ సన్నద్ధత సమావేశం జరిగింది. సాయంత్రం భాస్కర కాన్ఫరెన్సు హాలులో లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశం నిర్వహించిన తర్వాత ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన మూడు ఉపగ్రహలలో.. ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువు ఉండే ఈవోఎస్‌-07 ఉపగ్రహం. దీనితో పాటు అమెరికలోని అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్‌-1 ఉపగ్రహం. చెన్నై స్పేస్‌కిడ్జ్‌ ఇండియా ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్‌-2ఉపగ్రహలు ఉన్నాయి. ఈ ప్ర. ఈ ప్రయోగం 13 నిమిషాల 2 సెకండ్లలో పూర్తై.. 450 కిలోమీటర్ల ఎత్తులో ఈవోఎస్‌-07, జానుస్‌-1, చివరగా ఆజాదీశాట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టింది.

ఇవీ చదవండి :

Last Updated : Feb 10, 2023, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details