Srivani ticket counter at airport: తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్ల కేంద్రాన్ని తిరుపతి విమానాశ్రయంలో ఏర్పాటు చేసినట్లు తితిదే జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. తిరుపతి విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ ను శాస్త్రోక్తంగా పూజలు చేసి ఆయన ప్రారంభించారు. శ్రీవాణి ట్రస్టుకు 10 వేల రూపాయలు విరాళం ఇచ్చి టికెట్ కోసం 500 రూపాయలు చెల్లించే భక్తులకు తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేసేవారని... దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్లు జారీ చేస్తున్నామన్నారు.
విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ కౌంటర్ : తితిదే జేఈవో వీరబ్రహ్మం - Andhra Pradesh News
Srivani ticket counter has been set up at the airport: దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తితిదే జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. గురువారం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆయన శాస్త్రోక్తంగా పూజలు చేసి, బుక్ చేసుకున్న యాత్రికులకు టికెట్లు అందజేశారు. శ్రీవాణి ట్రస్టుకు 10వేల రూపాయలు విరాళం, టికెట్‌కు 500 రూపాయలు చెల్లించే భక్తులకు దర్శన టికెట్లు అందజేస్తామన్నారు
ఇప్పటికే తిరుపతిలోని మాధవం వసతిగృహంలో శ్రీ వాణి ట్రస్ట్ టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. విమానాశ్రయం, తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్ లో శ్రీ వాణి టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల దాతలు ముందురోజు తిరుమలకు వెళ్ళి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. దాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించి తితిదే యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి మాధవంలో వారికి వసతి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి: