ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MOHAN BABU: 'పిలిచారు.. వచ్చాను.. సంతకం పెట్టాను.. వెళ్లిపోతున్నా'- మోహన్​బాబు - తిరుపతి జిల్లా తాజా వార్తలు

MOHAN BABU: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​ మెంట్ నిధులు విడుదల చేయాలంటూ నిరసన చేపట్టిన కేసులో శ్రీవిద్యానికేతన్ ఛైర్మన్ మోహన్​బాబు హాజరయ్యారు. జిల్లాలోని ఎన్టీఆర్​ కూడలి నుంచి విద్యార్థులతో కలిసి మోహన్ బాబు కుమారులిద్దరితో కోర్టు వరకు కాలినడకన వచ్చారు.

MOHAN BABU
'పిలిచారు.. వచ్చాను.. సంతకం పెట్టాను.. వెళ్లిపోతున్నా'- మోహన్​బాబు

By

Published : Jun 28, 2022, 3:35 PM IST

MOHAN BABU:విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​ మెంట్ నిధులు విడుదల చేయాలంటూ నిరసన చేపట్టిన కేసులో శ్రీవిద్యానికేతన్ ఛైర్మన్, సినీనటుడు మోహన్ బాబు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. చంద్రగిరి పరిధిలోని శ్రీవిద్యానికేతన్ సమీపంలో 2019 మార్చి 22న విద్యార్థులతో కలిసి.. తిరుపతి - మదనపల్లె రహదారిపై ఆందోళన నిర్వహించారు. అందులో.. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్ పాల్గొన్నారు. అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో మోహన్ బాబుపై చంద్రగిరి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తిరుపతిలో జరుగుతున్న కేసు విచారణకు హాజరు కావాలంటూ కోర్టు సమన్లు జారీ చేయడంతో ఇవాళ కుమారులిద్దరితో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ఎన్టీఆర్​ కూడలి నుంచి విద్యార్థులతో కలిసి మోహన్ బాబు కోర్టు వరకు కాలినడకన వచ్చారు. విచారించిన ధర్మాసనం.. సెప్టెంబర్ 20కు వాయిదా వేసింది.

'పిలిచారు.. వచ్చాను.. సంతకం పెట్టాను.. వెళ్లిపోతున్నా'- మోహన్​బాబు

ABOUT THE AUTHOR

...view details