Tirumala Temple: శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. సూర్యగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల11 నిమిషాలకు ఆలయ తలుపులను మూసివేశారు. దాదాపు 12 గంటల అనంతరం రాత్రి ఏడున్నర గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహించి ఎనిమిదిన్నర గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులను తితిదే అనుమతించింది..అలాగే గ్రహణం అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును రాత్రి ఏడున్నర గంటలకు తెరిచారు. వంటశాల శుద్ధి చేసిన తర్వాత ఎనిమిదిన్నర గంటల నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. రాష్ట్రంలో మిగిలిన ఆలయాలు కొన్ని తెరుచుకున్నాయి. మరికొన్ని ఆలయాలు నేడు తెరుచుకోనున్నాయి.
తిరుమలలో సర్వదర్శనం ప్రారంభం... - ఏపీ తాజా వార్తలు
Tirumala Temple: తిరుమల శ్రీవారి ఆలయంలో సూర్యగ్రహణం అనంతరం సర్వదర్శనం ప్రారంభమైంది. గ్రహణం వీడిన తర్వాత శుద్ధి, కైంకర్యాలు నిర్వహించి ఆలయ అధికారులు భక్తులకు దర్శనానికి అనుమతించారు. రాష్ట్రంలో మిగిలిన ఆలయాలు కొన్ని తెరుచుకున్నాయి. మరికొన్ని ఆలయాలు ఇవాళ తెరుచుకుంటున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయం