ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు-బైక్ ఢీ.. ఇద్దరు మృతి - దుర్ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది

Road Accidents: రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటు తారా స్థాయికి చేరుతోంది. తాజాగా ఆర్టీసీ బస్సు బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ దుర్ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 17, 2023, 1:28 PM IST

Road Accidents: ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం, రోడ్లు సరిగా లేకపోవడం వలన రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాల వలన వారి కుటుంబాలు అర్ధాంతరంగా రోడ్డున పడాల్సిన వస్తోంది. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలను కోల్పోయిన ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది.

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ..ఇద్దరు మృతి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని తిరుపతి పీలేరు జాతీయ రహదారిలోని భాకరాపేట కనుమ దారిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. పీలేరు నుంచి తిరుపతి వైపు వస్తున్న ద్విచక్ర వాహనంను ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో తిరుపతిలో ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details