Mother and Son died in Road Accident: తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు నుంచి తిరుపతికి వస్తున్న కారు.. సి.మల్లవరం వద్ద కల్వర్టు గోడను డీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఎం.ఆర్.పల్లి పోలీసులు 108వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
కల్వర్టు గోడను ఢీకొట్టిన కారు.. తల్లీకుమారుడు మృతి - andhra pradesh latest news
Accident: డ్రైవర్ నిద్రమత్తు ఇద్దరి ప్రాణాలు తీసింది. కల్వర్టు గోడను కారు ఢీకొట్టడంతో తల్లీకుమారుడు మృతి చెందిన ఘటన తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది.
accident