Red sandalwood smuggling : తిరుపతి జిల్లాల యర్రావారిపాళ్యం మండలంలో ఎర్రచందనం స్మగ్లర్ల అలజడి నెలకొంది. గత రెండు రోజులుగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు యర్రావారిపాళ్యం క్రాస్ వద్ద ఈరోజు ఉదయం రెండు ఆటోలు, 6 ఎర్రచందనం దుంగలు.. ఒక ద్విచక్ర వాహనం, అలాగే పదిమంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆటో సీట్ల కింద ఆరు ఎర్రచందనం దుంగలు అక్రమంగా తరలిస్తున్నట్లు రహస్య సమాచారం అందడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. పట్టుబడ్డ వారంతా తమిళనాడు రాష్ట్రానికి చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. వారికి సహకరించిన స్థానిక స్మగ్లర్ కోసం గాలిస్తున్నామని సీఐ తులసీరామ్ తెలిపారు. కొత్త వ్యక్తులు గాని, అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి గురించి సమాచారం అందించి సహకరించాలని పోలీసులు కోరారు.
తిరుపతి జిల్లాలో ఎర్రచందనం స్వాధీనం - ఎర్రచందనం స్మగ్లింగ్
Red sandalwood smuggling : తిరుపతి జిల్లాలోని శేషాచల అడవులలో ఎర్రచందనం స్మగ్లర్లు పాగా వేశారు. తలకోన అటవీ ప్రాంతంలో ఎర్రచందనం వృక్షాలను నరికి ఆటోలలో తరలిస్తూ పదిమంది ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడ్డారు. ఎర్రచందనం విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Red sandalwood smuggling