Ramana Deekshitulu Controversial Tweet: ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అన్నారు. తిరుమలలో అధికారుల తీరుపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
తిరుమలలో ఆగమశాస్త్రాన్ని విస్మరిస్తున్నారు... ట్విటర్‌లో రమణ దీక్షితులు - టీటీడీలో అవకతవకలపై రమణ దీక్షితులు
Ramana Deekshitulu: తిరుమలలో ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించారు. సొంత ప్రణాళిక ప్రకారం తితిదే అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధనికులైన భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారని అధికారులపై మండిపడ్డారు.
రమణ దీక్షితులు
"తిరుమలలో ఆగమశాస్త్ర నియమాలు పాటించడం లేదు. శాస్త్ర నియమాలకు విరుద్ధంగా పని చేస్తున్నారు. సొంత ప్రణాళిక ప్రకారం తితిదే అధికారులు వ్యవహరిస్తున్నారు. ధనికులైన భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారు" అని రమణ దీక్షితులు ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: