Private Travels bus hit to Lorry: తిరుపతి జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పేరూరు బండ వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో బస్సులోని డ్రైవర్, క్లీనర్‌తో పాటుగా మరికొంతమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. నరసాపురం నుంచి బెంగళూరుకు 30 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు పేరూరు బండ వద్ద ముందు వెళుతున్న సిమెంటు లారీని ఢీకొంది. ఈ ఘటనలో ప్రైవేటు బస్సు ముందర భాగం నుజ్జునుజ్జయ్యింది. డ్రైవర్ బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో పోలీసులు.. స్థానికుల సహాయంతో బస్సుకు ఉన్న ఇనుప చువ్వలు తొలగించి డ్రైవర్, క్లీనర్‌తో పాటు ప్రయాణికుల్ని 108 లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మరికొందరికి స్వల్ప గాయాలు కాగా వారు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఎం.ఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం - accident at putalapattu highway
Accident: తిరుపతి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. నరసాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, క్లీనర్‌తో పాటు.. కొంతమంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి బస్సు ఓవర్ స్పీడే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
1