MURMU IN TIRUMALA : తిరుమల శ్రీవారిని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమలలోని పద్మావతీ అతిథి గృహంలో బస చేసిన ఆమె.. ఈరోజు ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట రాష్ట్రపతికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము - ap latest news
DRAUPADI MURMU IN TIRUMALA : భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా వరాహ స్వామిని దర్శించుకుని.. అనంతరం వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ద్రౌపది ముర్ముకు శ్రీవారి చిత్రపటం, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
DRAUPADI MURMU IN TIRUMALA
తొలుత వరాహ స్వామిని దర్శించుకుని.. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో ద్రౌపదీ ముర్ముకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం తితిదే ఛైర్మన్, ఈవో తదితరులు శ్రీవారి చిత్రపటం, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్రపతితో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ మంత్రులు నారాయణస్వామి, ఆర్కే రోజా, కొట్టు సత్యనారాయణ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 5, 2022, 5:40 PM IST