Jallikattu celebrations for Sankranti in Tirupati: తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలో రెండు నెలలకు ముందే సంక్రాంతి శోభ సంతరించుకుంది. సంక్రాంతి బొప్పరాజుపల్లిలో జల్లికట్టు వేడుకలు నిర్వహించడం చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ఆచారం. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో బొప్పరాజుపల్లిలో ఈరోజు జల్లికట్టు వేడుకలు నిర్వహించారు. దీనిని చూడడానికి చుట్టుపక్కల గ్రామస్థులు, యువకులు తరలివచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి యువకులను వారించే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్థులు వారి మాటలు లెక్క చేయక పండుగను కొనసాగించారు.
రెండు నెలల ముందే జల్లికట్టు.. రంగంలోకి పోలీసులు
Jallikattu celebrations for Sankranti: సంక్రాంతికి జల్లికట్టు వేడుకలు నిర్వహించడం చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాలో అనావాయితీగా వస్తోంది. ఈసారి సైతం ఆయా గ్రామాల్లో జల్లికట్టు వేడుకలు నిర్వహించాలనుకున్నారు యువకులు. సంక్రాంతికి 2 నెలల ముందే బొప్పరాజుపల్లిలో జల్లికట్టు వేడుకల కోసం పశువులకు శిక్షణ ఇస్తున్నారు. వేడుకలకు అనుమతులు లేవంటూ అడ్డుకున్నారు పోలీసులు. ఇదే విషయమై గ్రామస్థులు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది.
జల్లికట్టు వేడుకలు
పశువుల పండుగలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, పశువులను హింసించరాదని పోలీసులు యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోడంతో పోలీసులు.. యువకులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని పోలీసులకు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఏది ఏమైనా సంక్రాంతి పండుగ రోజున జల్లికట్టు వేడుకలు జరిపి తీరుతామని అందుకోసమే వాటికి తర్ఫీదు ఇస్తున్నట్టు గ్రామస్థులు తెలిపారు.
ఇవీ చదవండి: