తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైకాపా కార్యాలయానికి పోలీసు క్వార్టర్స్‌కు చెందిన 3 ఎకరాల స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పోలీసు స్టేషన్‌కు ఎదురుగా ఉన్న మూడున్నర ఎకరాల స్థలంలో గతంలో క్వార్టర్స్ నిర్మించారు. ఈ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో కూల్చివేశారు. ఈ స్థలంలో పోలీసుశాఖ ఉన్నతాధికారి కార్యాలయంగానీ, పోలీసు క్వార్టర్స్ గానీ నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.
వైకాపా కార్యాలయానికి పోలీసు క్వార్టర్స్ స్థలం.. విపక్షాల ఆగ్రహం - Police quarters allocated to Ysrcp office
తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలీసుశాఖకు చెందిన స్థలాన్ని.. వైకాపా కార్యాలయానికి కేటాయింపులు చేయటంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుని తీరుతామని.. తెదేపా, జనసేన నాయకులు హెచ్చరించారు.
అయితే.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత.. తుడా నిధులతో కల్యాణ మండపం, వ్యాయామశాల నిర్మిస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రతిపాదనలన్నీ పక్కకు నెట్టి, ఆ స్థలంలో వైకాపా కార్యాలయం నిర్మించాలని నిర్ణయించారు. ఏడాదికి ఎకరాకు వెయ్యి రూపాయల చొప్పున 3 ఎకరాలను 33 ఏళ్లకు అద్దెకు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తెలుగుదేశం, జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుశాఖకు చెందిన స్థలాన్ని వైకాపాకు ధారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని, అడ్డుకుంటామని జనసేన నాయకులు హెచ్చరించారు.
ఇవీ చూడండి