Gold Silver Recovery: తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో చోటు చేసుకున్న నగల దుకాణంలో చోరీ కేసును చేధించినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వివరించారు. తిరుపతి జిల్లా బాలయపల్లి మండలం జయంపు గ్రామానికి చెందిన నూకతోట్టి వెంకయ్య చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పుల పాలై తరచూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ముద్దాయి వెంకయ్య పై పలు కేసులు కూడా నమోదయినట్లు వివరించారు. ఇందులో భాగంగా ఈనెల 9న అర్ధ రాత్రి ఓ నగల షాపుకు వెనుక వైపు గోడకు కన్నం వేసి అందులో వున్న సుమారు 600 గ్రాముల బంగారు నగలు, 5 కేజీల వెండి వస్తువులతో పాటు 50 వేల నగదును దొంగలించి పారిపోయినట్లు ఫిర్యాదు అందిందని తెలిపారు. పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేసి ఇవాళ వెంకయ్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం వెంటనే ముద్దాయిని కోర్టులో హాజరు పరచి రిమాండుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ముద్దాయి వద్ద నుంచి మొత్తం 31 లక్షల 79 వేల రూపాయల విలువైన బంగారం,వెండి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
తిరుపతి జిల్లా నగల దుకాణం చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. - AP Crime News
Gold Silver Recovery: తిరుపతి జిల్లా వెంకటగిరిలోని నగల దుకాణంలో చోరీ కేసును పోలీసులు చేధించారు. జిల్లాలోని బాలయపల్లి మండలం జయంపు గ్రామానికి చెందిన నూకతోట్టి వెంకయ్య చోరీకి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు. నిందితుడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలై తరచూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వివరించారు.
పోలీసులు
Last Updated : Dec 27, 2022, 10:57 PM IST