PM Narendra Modi Tirupati Tour: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా తిరుమలకు చేరుకున్నారు. తొలుత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Justice Abdul Nazeer), సీఎం జగన్ (CM YS Jagan) స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుని మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. వారందరికీ మోదీ అభివాదం చేశారు. తరువాత అక్కడి నుంచి బయలుదేరి తిరుమల చేరుకుని.. రచన అతిథి గృహానికి రోడ్డుమార్గం ద్వారా చేరుకున్నారు.
అనంతరం రచన అతిథి గృహం వద్ద ప్రధానికి టీటీడీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డితో (TTD Chairman Karunakar Reddy) పాటు.. ఈవో ధర్మారెడ్డి (TTD Executive Officer Dharma Reddy) స్వాగతం పలికారు. ప్రధాని రాత్రి తిరుమలలో బస చేయనున్నారు (Prime Minister Narendra Modi Reached Tirumala) సోమవారం ఉదయం 8 నుంచి 8.45 గంటల మధ్య వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనున్నారు. అనంతరం 9.30 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణలోని హకీంపేటకు చేరుకొని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నారు.
విశ్వంలో భారతదేశం గొప్ప జ్ఞాన భాండాగారంగా అవతరించింది : మోదీ