Tirumala Temple: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి సందర్భంగా దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ ఉదయం స్వామివారికి ఉత్సవమూర్తులకు పట్టువస్త్రాలు అలంకరించి ప్రత్యేక హారతులను నివేదించారు. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తితిదే ఉన్నతాధికారుల సమక్షంలో బంగారు వాకిలిలో ఆస్థాన వేడుకలు విశేషంగా నిర్వహించామన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారని తెలియజేశారు.
Tirumala: శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం - Diwali at Tirumala Temple
Diwali at Tirumala Temple: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి సందర్భంగా ఆస్థానం నిర్వహించారు. ఈరోజు ఉదయం స్వామివారికి ఉత్సవమూర్తులకు పట్టువస్త్రాలు అలంకరించి ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారని తెలియజేశారు.
తిరుమలలో దీపావళి సందర్భగా ఆస్థానం